అమెరికాలోని న్యూజెర్సీలో ఖమ్మం జిల్లాకు చెందిన అక్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వర్తక సంఘం నేత నల్లమల్ల ఆనంద్ కుమార్తె అయిన అక్షిత, తన ఇంట్లో వాకింగ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మరణించినట్లు సమాచారం. ఈ విషాదకర ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.