TG: ఇంటికే మీసేవ సర్వీసులు

7099பார்த்தது
TG: ఇంటికే మీసేవ సర్వీసులు
TG: హైదరాబాద్‌లో మీసేవ డోర్ డెలివరీ సేవలు మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. 1100కు ఫోన్ చేసి లేదా మీసేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని ఇంటి వద్దకే జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, ఈసీ కాపీలు, పోలీస్ శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. తొలి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. 70 మందికి పైగా మీసేవ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி