తెలంగాణలో తలెత్తిన నీటి సమస్యపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఎదుర్కొంటున్నది ఎల్నినో కాదని, అది
కాంగ్రెస్ అసమర్థత అని ఆయన 'ఎల్-కాంగో' అంటూ విమర్శించారు. హైదరాబాద్ నగరానికి రోజువారీ అవసరాలకు 1,000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా, నిన్న కన్నెపల్లి వద్ద 20,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఎత్తిపోతలేదని
కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసుతో రేవంత్ రెడ్డి కావాలనే ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.