టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో లక్ష్య ఛేదన సమయంలో తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ 51.62 సగటుతో రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో విరాట్
కోహ్లీ 67.10 సగటుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఛేజింగ్‌లో 500కు పైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో
కోహ్లీ, తిలక్ వర్మ తర్వాత ఎంఎస్ ధోని (47.71), జేపీ డుమినీ (45.55), కుమార సంగక్కర (44.93) ఉన్నారు. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తిలక్ వర్మ తన నిలకడైన బ్యాటింగ్‌తో భవిష్యత్
టీ20 కెరీర్‌లో మరిన్ని రికార్డులను సృష్టించే దిశగా దూసుకెళ్తున్నారు.