AP: తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఇద్దరు చిన్నారు తీవ్రంగా గాయపడి బస్సులో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. స్థానికులు చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం.