వెంకీ, దుబాయ్ శీను వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన టాలీవుడ్ కమెడియన్ రామచంద్ర తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో పక్షవాతానికి గురై, ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం చేయించుకోవడం కష్టంగా ఉందని, వైద్యం కోసం దాతల
సహాయం కోరుతున్నారు.