కేటీపీఎస్ కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి

898பார்த்தது
కేటీపీఎస్ కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. రామవరానికి చెందిన తుడుం భరత్ (23), ఎస్.కె. సమీర్ (24) తమ స్నేహితులతో కలిసి కరకవాగు సమీపంలోని కేటీపీఎస్ కాలువలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వారిని బయటకు తీసేలోపే మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி