తమిళ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (93) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రంగస్థల కళాకారిణిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె, 60వ ఏట మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. సుదీర్ఘ నటజీవితంలో తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించి మెప్పించారు. జూ.ఎన్టీఆర్ నటించిన 'అదుర్స్' చిత్రంలో బామ్మ పాత్రలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులకు ఎంతో గుర్తుండిపోయింది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.