AP:
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని ఆటోనగర్ లో తెల్లవారుజామున లారీ క్లీనర్గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు రాయితో తలపై మోది కిరాతకంగా హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకొని పడమట పోలీస్ స్టేషన్కు తరలించారు. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.