సముద్రంలో నౌకలను పేల్చేందుకు ఉపయోగించే ప్రత్యేకమైన పేలుడు పరికరాలనే లింపెట్ మైన్స్ అంటారు. హర్మూజ్ జలసంధిలో భారతీయులు ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై జరిగిన దాడిలో వీటిని ఉపయోగించినట్లు సమాచారం. దుండగులు చిన్న పడవలపై వచ్చి కదులుతున్న నౌక అడుగుభాగానికి వీటిని అమర్చుతారు. అనంతరం రిమోట్ ద్వారా లేదా ముందుగా నిర్ణయించిన సమయం, పరిస్థితుల ఆధారంగా పేల్చవచ్చు. సముద్రంలోని రాళ్లకు గట్టిగా అతుక్కునే ‘లింపెట్’ అనే నత్త జాతి జీవి పేరు మీదుగా వీటికి ఈ పేరు వచ్చింది.