షమోండా వైరస్‌.. తొలిసారిగా ఎక్కడ గుర్తించారు?

4040பார்த்தது
షమోండా వైరస్‌.. తొలిసారిగా ఎక్కడ గుర్తించారు?
షమోండా వైరస్‌ను 1965లో నైజీరియాలోని పశువుల్లో తొలిసారిగా గుర్తించారు. 2026 అక్టోబర్‌ నాటికి పశువుల పెంపకం ఎక్కువగా ఉన్న యూరప్‌ దేశాలైన ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, ఐర్లాండ్ లో ఈ వైరస్‌ కేసులు నమోదయ్యాయి. షమోండా వైరస్‌ ప్రధానంగా సన్నని ఈగలను పోలిన మిడ్జ్‌ల కాటు ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఫ్రాన్స్‌లో ఈ వైరస్‌ సోకిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. అతడికి అప్పటికే తీవ్ర అనారోగ్యం, రోగనిరోధక శక్తి లోపం ఉండగా, వైరస్‌ కారణంగా మెదడుపై ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించారు.

தொடர்புடைய செய்தி