విద్యుత్ షాక్‌ తగిలి మహిళ మృతి!

580பார்த்தது
విద్యుత్ షాక్‌ తగిలి మహిళ మృతి!
TG: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తగిలి ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని మంగళవారిపేట శివారు గుడి తండాకు చెందిన భూక్య మంగమ్మ(37) కౌలు చేస్తున్న వరి పొలానికి బోరు నీరు పెట్టేందుకు వెళ్లింది. అయితే బోరు పెట్టె క్రమంలో విద్యుత్ షాక్‌ తగిలి మంగమ్మ మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మంగమ్మకు భర్త, కూతురు, కుమారుడు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி