ఉద్యోగుల కోసం ఆ నగరంలో ‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’

9479பார்த்தது
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, హైబ్రిడ్‌ వర్క్‌ తర్వాత ఇప్పుడు ‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’ ట్రెండ్‌ మొదలైంది. దుబాయ్‌లోని అల్‌ బర్షా పాండ్‌ పార్క్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫ్రీలాన్సర్లు, ఉద్యోగులు ప్రకృతి ఒడిలో పనిచేసేందుకు వైఫై, పవర్‌ సాకెట్లు ఏర్పాటు చేశారు. ఇండోర్‌ వర్క్‌స్పేస్‌ కావాలనుకునేవారు రోజుకు 50 దిర్హమ్‌లు (సుమారు రూ.1,300) చెల్లించి పాస్‌ తీసుకోవాలి. సాధారణంగా పార్క్‌లో కూర్చొని పనిచేసేవారికి ఎలాంటి రుసుము లేదు. దుబాయ్‌ మున్సిపాలిటీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.

தொடர்புடைய செய்தி