WPL-2027 షెడ్యూల్ విడుదల

5575பார்த்தது
WPL-2027 షెడ్యూల్ విడుదల
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 14 నుండి ఫిబ్రవరి 7 వరకు ఈ టోర్నీ జరగనుంది. వడోదర, ముంబయి వేదికలుగా చెరో 11 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జనవరి 14న వడోదరలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. క్రికెట్ అభిమానులు ఈ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

தொடர்புடைய செய்தி