TG: మాజీ అమంత్రి హరీశ్ రావుపై CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో ఉన్న సమయంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారని CM ఆరోపించారు. హరీశ్ రావుకు
కేసీఆర్ అసలైన గురువు కాదని, వైఎస్సార్ నిజమైన గురువు అని ఆయన పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతో వైఎస్సార్‌కు హరీశ్ గురుదక్షిణ చెల్లించుకున్నారని అన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే హంద్రీనీవాకు 40 టీఎంసీల నీటిని మళ్లించేలా జీవో జారీ చేశారని ప్రెస్మీట్లో సీఎం రేవంత్ తెలిపారు.