-Election

ఓటర్ల జాబితా సవరణ జనవరి 1 నుంచి: ఎన్నికల సంఘం ప్రకటన

ఓటర్ల జాబితా సవరణ జనవరి 1 నుంచి: ఎన్నికల సంఘం ప్రకటన

భారత ఎన్నికల సంఘం దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SSR) ప్రక్రియను జనవరి 1 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాలతో పాటు 17 రాష్ట్రాల్లో ఈ సవరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ కోసం 2027 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించారు. ఈ ప్రత్యేక సవరణలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. అర్హులైన కొత్త ఓటర్లను, ముఖ్యంగా తొలిసారి ఓటు వేసే యువతను జాబితాలో చేర్చడం, తప్పులను సరిదిద్దడం, మృతి చెందినవారు, వలస వెళ్లినవారి పేర్లను తొలగించడం జరుగుతుంది.