-PM

రూ.10,021 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం

రూ.10,021 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) బుధవారం దేశవ్యాప్తంగా రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 17 జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు నిర్మించబడతాయి. ఇందులో భాగంగా ఏపీలోని రేణిగుంట–అరక్కోణం మార్గంలో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైను పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టులు 2029-30 నాటికి పూర్తవుతాయి. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలైన తిరుపతి, యాదగిరిగుట్టలకు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల 42 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా.