
సెప్టెంబర్ 25 నాటికి నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దు.. క్లారిటీ
డ్రైవింగ్ లైసెన్స్కు సెప్టెంబర్ 25 నాటికి మొబైల్ నంబర్ అనుసంధానించకపోతే లైసెన్స్ రద్దవుతుందనే వార్తలు అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర రవాణా శాఖ ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని సూచించారు. అయితే, ఈ-చలాన్, రెన్యూవల్ సేవలు సులభతరం కావడానికి వాహనదారులు 'పరివాహన్' పోర్టల్ ద్వారా ఉచితంగా మొబైల్ నంబర్ లింక్ చేసుకోవచ్చని తెలిపారు. నకిలీ లింకులు, వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
















































