రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి - ఆర్డీవో బిక్షానాయక్‌

114చూసినవారు
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి - ఆర్డీవో బిక్షానాయక్‌
కోదాడ : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని, ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తూనే బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని కోదాడ ఆర్డీవో బిక్షానాయక్‌ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధన దిశలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. శనివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని కోదాడ ఆర్డీవో కార్యాలయంలో ఆయన జాతయ జెండాను ఆవిష్కర్ణించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నిధులు, నియామకాలు, సంక్షేమ పథకాలు, ప్రజాభ్యున్నతి కొసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అవిర్భవించి నాలుగు సంవత్సరాలు అవుతున్నదని, ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తున్నదని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సాగు, తాగు నీరు అందించేందుకు మిషన్‌ భగీరధ, మిషన్‌ కాకతీయ కార్యక్రమాలను తీసుకొచ్చిందని, దీని ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు సాగు నీటిని మిషన్‌ భగీరధ ద్వారా చెరువులను మరమ్మతులు చేయించి, అనేక ప్రాజెక్టులను తీసుకొస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ నదులపై ఇప్పటికే అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చి కోట్లాది ఎకరాలకు నీరు అందించేందుకు బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. నీళ్ళు , నిధులు సాధించుకుంటున్న ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అనేక విధాలుగా కృషి చేస్తున్నదని, ఇప్పటికే వేల ఉద్యోగాలను భర్తి చేసి నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని భూప్రక్షాళన చేపట్టి భూమిని సమగ్ర సర్వే చేసి కొత్త పాస్‌పుస్తకాలను రైతులకు అందించిందని, అదే విధంగా రైతులకు వ్వవసాయానికి పెట్టుబడి కింద సంవత్సరానికి ఎకరానికి రూ.8 వేలు పథకాన్ని తీసుకొచ్చి మొదటి విడతగా రూ. 4వేల రూపాయలను ఇప్పటికే రైతులకు అందించడం జరిగిందని, ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ధ్యేయంతో ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా అనేక వర్డాల వారికి పించన్లు ఇవ్వడం జరుగుతున్నదని, పేదలకు డుబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం జరుగుతున్నదన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, ప్రజలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆవిర్భావ దినోత్సవాలు కోదాడ డివిజన్‌ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పట్టణంలో జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, తహీసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వందనపు శ్రీదేవి, మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వంటిపులి అనితనాగరాజు, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ డేగరాణి, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ ఇంచార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పట్టణ అద్యక్షుడు పయిడిమర్రి సత్యబాబు, టీడీపీ కార్యాలయంలో
ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్యయాదవ్‌, గాంధీపార్కు వద్ద మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అనిత, మహిళా మండలిలో నూనె సులోచన, గ్రంథాలయంలో చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌లతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా వివిధ స్యచ్చంధ సంస్థలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాగా పట్టణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాలుర్పించారు. కాగా బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరులకు తెలంగాణ తల్ల విగ్రహం వద్ద నివాళుర్పించారు. ఈ కార్యక్రమాలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు యెర్నేని వెంకటరత్నంబాబు, ఎంబిసి జిల్లా అద్యక్షుడు వంటిపులి నాగరాజు, పారీసీతయ్య, కుకడ్రపు బాబు, కెఎల్‌ఎన్‌ప్రసాద్‌, కారంపూడి రాధమ్మ, గట్ట కోటేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు తెప్పని శ్రీనివాసరావు, కొండపల్లి వాసుదేవరావు, కొమరిగిరి రంగారావు, షమ్మి, బాగ్దాద్‌, కోటేశ్వరరావు, పాశం శ్రీను, టీడీపీ నాయకులు దండావీరభద్రం, ఓరుగంటి ప్రభాకర్‌, సామినేని ప్రమీల, సురేష, జాకీర్‌, చీమశ్రీనివాసరావు, గ్రంథాలయంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటి సభ్యులు, మునిసిపల్‌ కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా బీసీ సంఘం నాయకులు అమరగాని కృష్ణగౌడ్‌, దేశనేని రాజశేఖర్‌, వెంకటేశ్‌, సాయి, శ్రీను, వెంకటకృష్ణ, గణేష్‌, గోపి, కార్తిక్‌, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్