AP: వైయస్ఆర్ కడప జిల్లా, వేంపల్లె మండలం, ఇడుపులపాయ గ్రామంలోని మారుతి నగర్‌కు చెందిన 10 కుటుంబాలు శనివారం
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. గండి మాజీ దేవస్థాన చైర్మన్ కృష్ణతేజ ఆధ్వర్యంలో చేరిన ఈ కార్యకర్తలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం టీడీపీకి షాక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.