AP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. 100 కుటుంబాలతో కలిసి చేజర్ల
వైసీపీ మాజీ ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి టీడీపీలో చేరారు. చేజర్ల, ఆత్మకూరు మండలాలకు చెందిన
వైసీపీ నేతలు టీడీపీలో చేరడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో
టీడీపీ పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.