ఏపీలో భర్తీ కాని 112 NRI కోటా సీట్లు

20చూసినవారు
ఏపీలో భర్తీ కాని 112 NRI కోటా సీట్లు
AP: MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌‌కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అక్టోబర్‌ 23తో స్టేట్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌ ముగిసింది. రేపటితో MBBS, BDS ప్రవేశాల గడువు ముగియనుంది. ఏపీలో 112 NRI కోటా సీట్లు భర్తీ కాలేదు. మరో 15 రోజులు గడువు పొడిగించాలని ఎన్టీఆర్‌ వర్సిటీ లేఖ రాసింది. అలాగే నీట్‌ యూజీ అర్హత శాతం తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విజ్ఞప్తులను పరిశీలిస్తామని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్