ఎన్నికల పర్యవేక్షణకు 13,500 సీసీ కెమెరాలు: SEC

0చూసినవారు
AP: స్థానిక ఎన్నికల పర్యవేక్షణకు 13,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు SEC అనిల్ చంద్ర పునేఠా అన్నారు. ఈ మేరకు వెబ్‌కాస్టింగ్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 13,500 సీసీ కెమెరాల ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఏ.మల్లిఖార్జునతో కలిసి వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షించినట్లు తెలిపారు. ఎన్నికల్లో పారదర్శకత, నిరంతర పర్యవేక్షణ కోసమే వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థ ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్