పాఠశాల బెంచ్‌లో 156 బ్యాలెట్ పేపర్లు (వీడియో)

9చూసినవారు
AP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం యాటకల్లు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన మరుసటి రోజున షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానిక పాఠశాల బెంచీల్లో ఏకంగా 152 బ్యాలెట్ పేపర్లు బయటపడ్డాయి. ఇవన్నీ వైసీపీ మద్దతుదారుకు సంబంధించిన కత్తెర గుర్తుపై ఉన్న ఓట్లు కావడంతో కలకలం రేగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు 132 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. అయితే, అధికారులపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలు ఫలితాలను తారుమారు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్