AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో నక్సల్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చామని డీజీపీ హరీష్ కుమర్ గుప్తా తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లతో ఎప్పటికప్పుడు తమ వాళ్లు మాట్లాడుతూ వారి జీవనోపాధి పై ఆరా తీస్తున్నారని చెప్పారు. శనివారం రాజధాని అమరావతిలోని ఏపీ డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు పునరావాస సహాయం కింద రూ. 75 లక్షల డి.డిలను ఆయన స్వయంగా అందజేశారు.