ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో మొత్తం 1,985 ఎంపీటీసీ, 77 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక తెలిపింది. ఎంపీటీసీ స్థానాల్లో పల్నాడు జిల్లాలో అత్యధికంగా 382, కడపలో 358, మార్కాపురంలో 217, ప్రకాశంలో 153, అన్నమయ్యలో 169, నంద్యాలలో 150 స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అలాగే జెడ్పీటీసీ స్థానాల్లో కడపలో 23, పల్నాడులో 18, నంద్యాలలో 8 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని అధికారికంగా వెల్లడించింది.