మరో 2 నోటిఫికేషన్లు.. మొత్తం 2007 పోస్టులు

16చూసినవారు
మరో 2 నోటిఫికేషన్లు.. మొత్తం 2007 పోస్టులు
AP: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో మూడు కొత్త నోటిఫికేషన్లను విడుదల చేసింది. కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ పోస్టులు, మెకానిక్స్ (మెన్) విభాగంలో 15 కానిస్టేబుల్ పోస్టులు, డ్రైవర్స్ (మెన్) విభాగంలో 198 కానిస్టేబుల్ పోస్టులకు ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అలాగే, కమ్యూనికేషన్ విభాగంలో 50, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో 10 సబ్-ఇన్స్పెక్టర్ (SI) పోస్టులకు కూడా వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంతకుముందు సివిల్, AR, ఫైర్మెన్, SPF కానిస్టేబుల్, SI పోస్టులకు రెండు నోటిఫికేషన్లు విడుదల చేయగా, మొత్తం 2,007 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది.

సంబంధిత పోస్ట్