2025 మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: జగన్‌

20చూసినవారు
2025 మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: జగన్‌
AP: 2025 మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. అక్రమాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ చంద్రబాబులో బీపీ పెరుగుతోందన్నారు. తన ప్రశ్నలకు చంద్రబాబు, లోకేశ్‌ సమాధానం చెప్పడం లేదని, ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నపత్రం తయారు చేశారని ఆరోపిస్తూ.. ఇది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అని వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన జర్నలిస్టులపైనా అక్రమ కేసులు పెట్టారని జగన్‌ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్