ఏపీలో PMAY-అర్బన్ 1.0 కింద 2024కు ముందు మంజూరైనా.. నిర్మాణాలు ప్రారంభం కాని 3.71 లక్షల ఇళ్లను కేంద్రం రద్దు చేసింది. ఈ పథకం గడువు 2024 డిసెంబరుతో ముగిసినా రెండుసార్లు పొడిగించారు. 2026 జులై నాటికీ పనులు ప్రారంభించకపోవడంతో ఇళ్లను రద్దు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనిపై స్పందించిన ఏపీ సర్కార్
జియో ట్యాగింగ్ పూర్తయిన 1.27 లక్షల ఇళ్లను పునరుద్ధరించడంతో పాటు మిగతావాటిని PMAY-2.0లోకి మార్చాలని కేంద్రాన్ని కోరింది.