AP: విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీల మధ్య తేడా తెలియని వారే తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు 14 డీఎస్సీలు వేశారని, తమ ప్రభుత్వాల హయాంలో 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, 2029 నాటికి మరో మూడు డీఎస్సీలు వస్తాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.