వైసీపీని వీడి టీడీపీలో చేరిన 300 మైనార్టీ కుటుంబాలు!

6చూసినవారు
వైసీపీని వీడి టీడీపీలో చేరిన 300 మైనార్టీ కుటుంబాలు!
AP: సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో సుమారు 300 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. నిజాం వలి కాలనీకి చెందిన ఈ కుటుంబాలు 15వ వార్డు టీడీపీ పార్టీ ఇంచార్జ్ హైదర్ అలీ ఆధ్వర్యంలో కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చేరాయి. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఇది వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్