AP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. విశాఖ జిల్లా భీమిలి మండలం మూలకుద్దుకు చెందిన 300 మంది
వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తగరపువలస, అమరావతి నగర్, ఆనందపురం ప్రాంతాల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు.