ఏపీలో పేదల కోసం 3D ఇళ్ల నిర్మాణాలు

4చూసినవారు
ఏపీలో పేదల కోసం 3D ఇళ్ల నిర్మాణాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అత్యాధునిక 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి, కేవలం ₹5.10 లక్షల వ్యయంతో ఐదు రోజుల్లోనే ఇళ్లను నిర్మించనుంది. గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం, ఓబులనాయుడు పాలెంలో ఈ నూతన విధానంలో తొలి దశలో 177 ఇళ్లను నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన గాంట్రీ రోబోట్ యంత్రాన్ని వినియోగించనున్నారు. ఈ యంత్రం డిజైన్ కమాండ్స్ ప్రకారం కాంక్రీట్ బ్లాకులను వేస్తూ గోడలను నిర్మిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్