AP: ఇవాళ్టితో రాష్ట్రంలోని స్కూళ్లకు దసరా సెలవులు ముగిశాయి. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. అయితే స్కూళ్లకు మళ్లీ వరుసగా నాలుగు రోజులు సెలవులు రాబోతున్నాయి. ఈ నెల 25న ఆదివారం.. సాధారణంగా స్కూళ్లకు సెలవు ఉంటుంది. 26న మహర్షి వాల్మీకి జయంతి పండుగ ఉంది. ఆ రోజు స్కూళ్లకు సెలవు నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. 27, 28 తేదీల్లో మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.