AP:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్ తగలింది. పట్టణానికి చెందిన సుమారు 400 కుటుంబాలు వైసీపీని వీడి ఆదివారం ఆమదాలవలస ఎమ్మెల్యే, కూన రవికుమార్ సమక్షంలో
టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోని ఆటో డ్రైవర్ల యూనియన్, కూరగాయల మార్కెట్ యూనియన్, ట్రైలర్ యూనియన్ సభ్యులతో పాటు ఆర్యవైశ్య సంఘానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. కూన రవికుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.