ఏపీ స్థానిక ఎన్నికల్లో 410 కోడ్ ఉల్లంఘన కేసులు

1చూసినవారు
ఏపీ స్థానిక ఎన్నికల్లో 410 కోడ్ ఉల్లంఘన కేసులు
AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ఎన్నికల సంఘం బుధవారం కీలక నివేదికను విడుదల చేసింది. ఒక్క రోజే 410 ఎంసీసీ ఉల్లంఘన కేసులు, 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అక్టోబర్ 15 నుండి 28 వరకు మొత్తం 33,505 ఉల్లంఘన కేసులు, 251 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకు 107 మందిని అరెస్టు చేయగా, 9,264 ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 814 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో నిఘా కొనసాగిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్