మత్స్యకారులకు ఉచితంగా 50 కేజీల బియ్యం: చంద్రబాబు

2చూసినవారు
మత్స్యకారులకు ఉచితంగా 50 కేజీల బియ్యం: చంద్రబాబు
AP: భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని ఆయన ఆదేశించారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పలు జిల్లాల్లోని రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలపై ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50% నుంచి 31%కి తగ్గిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్