ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన జులై 31వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు మొత్తం 7,62,766 మంది కొత్తగా ఓటును నమోదు చేసుకున్నారు. ఈ నమోదు ప్రక్రియతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,75,69,896కు చేరింది. అయితే, అంతకుముందు రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా, వివిధ కారణాల వల్ల 44.8 లక్షల మంది ఓట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30 వరకు ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత భారత ఎన్నికల సంఘం (CEC) తుది ఓటర్ల జాబితాను ప్రకటించనుంది.