AP: కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీలో YCPకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన 8 మంది మాజీ కౌన్సిలర్లు, ఒక కోఆప్షన్ సభ్యుడు, నలుగురు కీలక నియోజకవర్గ నాయకులు మూకుమ్మడిగా తమ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితమే మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాయి ప్రసాద్ కూడా పార్టీని వీడారు. నాయకులు పెద్ద ఎత్తున పార్టీని వీడటంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. రానున్న మున్సిపల్ ఎన్నికలపై ఈ పరిణామాల ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.