AP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం జిల్లా జామి మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎం.కొత్తవలస, అట్టాడ గ్రామాలకు చెందిన 90 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి స్వచ్ఛందంగా పార్టీలోకి చేరుతున్నారని మంత్రి కొండపల్లి అన్నారు. పార్టీలో చేరిన ప్రతిఒక్కరికి సముచిత స్థానం దొరుకుతుందన్నారు.