AP: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 93 ఏళ్ల వృద్ధుడు అడుసుమిల్లి రామ బ్రహ్మం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆయన పాల్గొనడం విశేషం. ఈ గ్రామంలో పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చాలా ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు.