AP: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి అరుదైన ఘనత సాధించారు. ఆమె 2014లో
టీడీపీ నుంచి, 2021లో
వైసీపీ నుంచి గెలుపొందగా, తాజాగా
బీజేపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగి 3,805 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మూడు వేర్వేరు పార్టీల తరఫున వరుసగా మూడుసార్లు ఛైర్‌పర్సన్‌గా ఎన్నికై ఆమె రాజకీయంగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.