AP: పేద, మధ్యతరగతి కుటుంబాలకు శుభవార్త. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కేవలం ఒక్క రూపాయికే ఏసీ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. శుభకార్యాలను ఎంతో వైభవంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. 5,000 మంది కెపాసిటీతో సెంట్రల్ AC, పార్కింగ్, జిమ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఈ అద్భుతమైన ఫంక్షన్ హాల్‌ను ఇటీవల మంత్రి నారాయణ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.