AP: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 2018లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులకు సంబంధించి విచారణ జరుగుతోంది. 2018లో సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన బాలాజీ, సీనియర్ అసిస్టెంట్ దస్తగిరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.