ధరల నియంత్రణపై కార్యాచరణ: సీఎం చంద్రబాబు

38చూసినవారు
ధరల నియంత్రణపై కార్యాచరణ: సీఎం చంద్రబాబు
AP: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధరలను అదుపులో ఉంచడానికి ఏడాది కాలానికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వారం ధరలపై సమీక్ష చేపట్టాలని, వినియోగదారులకు భారం లేకుండా, రైతులకు నష్టం కలగకుండా చూడాలని సూచించారు. ధరల నియంత్రణకు నెలకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, బియ్యం నిల్వలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన నిఘా ఉంచాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్