వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కళ్యాణ్

38చూసినవారు
వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కళ్యాణ్
AP: భారీ వర్షాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు ఆయన సూచనలు చేశారు. ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, వాగులు పొంగుతున్న వేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్