AP: విశాఖపట్నం నుంచి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతదేహాన్ని ఏలూరుకు తరలిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా అంబులెన్స్లో ఆళ్ల నాని మృతదేహాన్ని తీసుకొస్తున్నారు. ఏలూరులోని ఆళ్ల నాని నివాసంతో కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచనున్నారు. విదేశాల్లో ఉన్న ఆయన ఇద్దరు కుమారు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు ప్రభుత్వం ఆళ్ల నాని కుటుంబ సభ్యులను సంప్రదించినట్లు సమాచారం.