
శారదా నదిలో శవమై తేలిన రైతు
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన రైతు కృష్ణ (52) శారదా నదిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం పశువులను మేతకని నది వైపు వెళ్లిన ఆయన సాయంత్రానికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన నదిలో ప్రమాదవశాత్తు జారి పడి ఉంటారని అనుమానించగా, శనివారం ఉదయం గవరవరం వద్ద కృష్ణ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





























