
కారు బీభత్సం.. ఒకరి పరిస్థితి విషమం
విశాఖపట్నం బీచ్ రోడ్డులో అప్పుఘర్ సమీపంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బిర్యానీ కోసం రోడ్డు పక్కన ఆగిన వాహనాలపైకి అదుపుతప్పిన కారు దూసుకెళ్లడంతో ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా సీసీటీవీలో రికార్డయ్యాయి.































