
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని బీసీ రోడ్డు, ఇందిరా కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. 36 ఏళ్ల సురేష్ కుమార్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు వృత్తిరీత్యా కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి, తదుపరి వివరాలను సేకరిస్తున్నారు.

























